Jesus loves jesus helps telugu

 

యేసు ప్రేమించుచున్నాడు, సహాయము చేయుచున్నాడు

JESUS  LOVES,  JESUS  HELPS

పరిశుద్ధ గ్రంథములో నుండి తీయబడిన ఈ క్రింది వాక్యములు ప్రభువైన యేసు నిజముగానే మనలను ప్రేమించుచున్నాడు, మనకు సహాయం చేయుచున్నాడు అనువాతటిని నిరూపించుచున్నవి:

     ప్రయాసపడి భారం మోసికొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు (యేసు) రండి; నేను మీకు విశ్రాంతి కలుగాజేటును (మత్తయి  11:28).

        “అతడు (యేసు) నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేనతని తప్పించెదను  అతడు నా నామము నెరిగినవాడు గనుక నేనతని ఘనపరచెదను  (కీర్తనలు 91:14).

      ఈ దీనుడు మొఱ్ఱపెట్టగా యెహోవా (యేసు) ఆలకించెను అతని శ్రమలన్నిటిలో నుండి అతని రక్షించెను (కీర్తనలు 34:6).

        ఆయన (యేసు) తన వాక్కును పంపి వారిని బాగుచేసెను ఆయన వారు పడిన గుంటలలోనుండి వారిని విడిపించెను (కీర్తనలు 107:20).

      ఒకని తల్లి వానిని ఆదరించునట్లు నేను (యేసు) మిమ్మును ఆదరించెదను (యెషయా 66:13).

        “నేను (యేసు) నిన్ను మరచిపోజాలను (యెషయా 44:21).

      యెహోవా (యేసు) ఉత్తముడని రుచి చూచి తెలిసికొనుడి (కీర్తనలు 34:8)

      యేసుక్రీస్తు నిన్న, నేడు, ఒక్కటే  రీతిగా ఉన్నాడు (హెబ్రీ. 13:8).

         యేసు – నేనే మార్గమును, సత్యమును, జీవమును; నా ద్వారానే తప్ప యెవడును తండ్రియొద్దకు రాడు (యోహాను 14:6).

       నశించినదానిని వెదకి రక్షించుటకు మనుష్యకుమారుడు (యేసు) వచ్చె(ను) (లూకా 19:10).

          తనను (యేసు) ఎందరంగీకరించిరో వారందరికి, అనగా తన నామమునండు విశ్వాసముంచినవారికి, దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను (యోహాను 1 : 12).

       దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను.  కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా పుట్టిన వానియందు (యేసు) విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను (యోహాను 3:16).

          “మన యతిక్రమక్రియలనుబట్టి అతడు (యేసు) గాయపరచబడెను  మన దోషములనుబట్టి నలుగగొట్టబడెను  మన సమాధానార్థమైన శిక్ష అతనిమీదపడెను  అతడు పొందిన దెబ్బలచేత మనకు స్వస్థత కలుగుచున్నది (యెషయా 53:5).

నేను (యేసు) గొర్రెలకు మంచి కాపరిని; మంచి కాపరి గొర్రెలకొరకు తన  ప్రాణము పెట్టును (యోహాను 10:11)

ఏలయనగా మనమింక బలహీనులమై యుండగా, క్రీస్తు యుక్తకాలమున భక్తిహీనులకొరకు చనిపోయెను (రోమా  5:6).

        ఏలయనగా పాపమువలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తుయేసునందు నిత్యజీవం (రోమా 6:23).

             “యేసు – పరలోకరాజ్యము సమీపించియున్నది గనుక మారుమనస్సు పొందుడని చెప్పె(ను) (మత్తయి 4 : 17).

         ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటివారును రక్షణ పొందుదు(రు) (అపొ.కా.  16:31).

            నా యొద్దకు (యేసు) వచ్చువానిని నేనెంతమాత్రమును బయటికి త్రోసివేయను (యోహాను  6:37).

           “నేను (యేసు) వెళ్లి మీకు స్థలము సిద్ధపరచినయెడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరల వచ్చి నాయొద్ద నుండుటకు మిమ్మును తీసికొని పోవుదును (యోహాను  14:3).

           ప్రభువైన యేసు సుమారు 2000 సంవత్సరములకు క్రితమే ఈ లోకమునకు వచ్చెను.  ఆయన సమస్త జనులకు మేలుచేయుచు ప్రతివిధమైన రోగమును (వ్యాధిని) స్వస్థపరచుచు సంచరించుచుండెను.  పరలోకరాజ్యమునకు వెళ్ళు మార్గమును ఆయన జనులకు బోధించెను.  ప్రతి మనుష్యుని పాపములకొరకు ఆయన సిలువ మరణమును అనుభవించెను.  ఆయన మృతులలోనుండి లేచి సజీవునిగా ఉన్నాడు.  ఆయన మరల వచ్చును.  నేటికిని ఆయనయొద్దకు వచ్చువారందరికిని ఆయన మేలు చేయుచున్నాడు.

      ప్రార్థన : ప్రభువైన యేసూ, నేను నిన్ను ప్రేమించుచున్నాను.  నా పాపములను క్షమించి నా రోగములను స్వస్థపరచుము.  నాకు సమాధానమును, విశ్రాంతిని, సంతోషమును దయచేయుము.  నాకు నిత్యజీవమును అనుగ్రహించి నన్ను ఆశీర్వదించుము.  ఆమేన్.

 For more information please contact : contact@sweethourofprayer.net

You can find equivalent English tract @

Jesus Loves, Jesus Helps