Eternal Inheritance

నిత్యస్వాస్థ్యము

 

ఆదియందు దేవుడు నేలమంటితో వరుని నిర్మించి, ఆతని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయెనని మనుష్యుని సృష్టించిన విధానమును గురించి వేదగ్రంథము తెలుపుచున్నది (ఆది. 2.7).   ఈ విధముగా దేవునియొక్క అక్షయమైన జీవముగలవాడై అనగా నశించని ప్రాణముగలవాడుగా సృష్టింపబడిన మానవుడు పాపము చేసినప్పుడు, అతని ప్రాణము దేవుని నుండి వేరుచేయబడుట మాత్రమే గాక, అతని శరీరముకూడ నాశనమునకు గురి అయెను. ఇలా, మన శరీరం క్షయమైనదైనప్పటికిని, మన ప్రాణము అక్షయమైనది గనుక, ఈ భూమిమీద మనము బ్రదికే కొద్దికాలపు జీవితానంతరము కోట్లకొలది సంవత్సరములు అంతమే లేని నిత్యములో మనము ఉండెదమనే  విషయము ఖచ్చితము. స్నేహితుడా, మీరు దీనిని ఎప్పుడైనా ఆలోచించితిరా? ఈ నిజాన్ని ఒకవేళ మీరు ఎగతాళిచేసి చులకనగా తలంచుదురేమో. అదేమైనాను సరే, ఏనాటికైనా ఏదో ఒక రోజున మరణము తథ్యం.  మనుష్యులొక్కసారే మృతి పొందవలెనని నియమింపబడెను; ఆ తరువాత తీర్పు జరుగును (హెబ్రీ.. 9.27); అటుపిమ్మట నీతిమంతులు నిత్యజీవనము పొందుటకును, దుర్నీతిపరులు నిత్య శిక్షపొందుటకును పోవుదురని పరిశుద్ధ గ్రంథము తెలుపుచున్నది. (మత్తయి 25:46).  కావున మన బ్రదుకు మరణముతోపాటు అంతరించునని అనుకొనుట వ్యర్థమే.  మరణానంతరము ఖచ్చితముగా, మీరు నిత్యానిత్యముగా సదాకాలం నరకములోనో లేక స్వర్గములోనో ఉందురని తెలిసికొనవలెను.  “దుష్టులను దేవుని మార్చు జనులందరును పాతాళమునకు దిగిపోవుదురు” (కీర్త. 9:17).   అంతేకాదు, సన్మార్గులకును లేక నీతిమంతులకును దుర్మార్గులకును లేక దుర్నీతిపరులకును దేవుడు ఏకరీతిగా తీర్పు తీర్చుదురు (ప్రసంగి 3:17).  ఎందుకనగా సన్మార్గమునకు సంబంధించిన క్రియలైన దానధర్మాలు, పూజాపునస్కారములను, బలియజ్ఞముల ద్వారా మనము భగవంతుని యెదుట మనలను నిర్దోషులనుగా చేసికొనజాలము.  దేవుడు వేవేలకొలది గొర్రె పొట్టేళ్ళ బలులయందును, తైలముతో నిండిన నైవేద్యముల యందును ఇష్టపడరు.  అయితే, “రక్తమే దానిలోనున్న ప్రాణమునుబట్టి ప్రాయశ్చిత్తము చేయును” (లేవీ. 17:11).  పాపాత్ముడు తన పాపమునకు ప్రాయశ్చిత్తము కలుగుటకు, తన సొంత రక్తమును ప్రోక్షించి, తనను తానూ విడిపించుకొనగాలడా?  అందువలన నిర్దోషుడు దోషులకొరకును, పాపరహితుడు పాపుల కొరకును, మరణించుట అవసరమనే న్యాయము ఋజువు చేయబడినది.

లోకములోని మానవవర్గమంతయు పాపపు ఊబిలో చిక్కుకొని, దానినుండి తప్పించుకునే మార్గమును వెదకుచున్నది.  మానవుడు దేవుని వెదకునప్పుడు ఆయనకూడ అతనిని వెదకుచు వచ్చుదురు. ప్రేమాస్వరూపియైన దేవుడు తనను తానూ తగ్గించుకొని, మనుష్యునిగా, పాపరహితునిగా అవతరించిరి.  సర్వాంతర్యామియైన ఆయన మానవరూపములో సంచరించిరి.  ఆయనే నిర్దోషుడును, పరిశుద్దుడును, పాపులలో చేరనివాడువైన ప్రభువైన యేసుక్రీస్తు.  ఆయన లోక పాపములను తనమీద మోసికొని శ్రమపడి మరణించిరి.  అయినాను ఆయన పాపరహితుడై యున్నందువలన మరణించిన మూడవ దినమున సజీవునిగా తిరిగిలేచిరి.  ఆయన మరణముద్వారా, ఆయనను నమ్మువారికి పాపక్షమాపణయు పరిశుద్ధ జీవితమును సంపాదించబడి ఉంచబడెను.

“మరి ఎవనివలనాను రక్షణ కలుగదు; ఈ నామముననే (ప్రభువైన యేసుక్రీస్తు) మనము రక్షణ పొందవలెను గాని, ఆకాశము క్రింకా మనుష్యులలో ఇయ్యబడిన మర ఏ నామమున రక్షణ పొందలేము” (అపా. 4:12).   ఆయనయందు విశ్వాసముంచువాడెవడో వాడు ఆయన నామము మూలముగా పాపక్షమాపణ పొందు (మ) (అపా. 10:43).  లోకరక్షకుడైన యేసుక్రీస్తు మీ పాపములకొరకు మరణించిరని విశ్వసించి, మీ పాపములను పశ్చాతాపముతో ఆయన యొద్ద ఒప్పుకొనునప్పుడు ఆయన పాపక్షమాపణను ఒసగుటయేకాక, ఈ లోకములో పరిశుద్ధముగా జీవించే శక్తిని సహా అనుగ్రహింతురు.  కాబట్టి మీకొరకు ప్రాణమును పెట్టిన ప్రభువైన యేసుని నమ్మి, నీ పాపములను పశ్చాతాపముతో ఒప్పుకొనుడి.  ఆయన మీ పాపములను క్షమించి, మీ హృదయమును శాంతి సంతోషాలతో నింపి, రోగముల నుండి సంపూర్ణ స్వస్థత ననుగ్రహించి మిమ్మును పరిశుద్ధ జీవితము వైపు నడుపుదురు.  పరిశుద్ధ జీవితమూ చేయు ఆయన దాసులకు పరలోకములో నిత్యస్వాస్థ్యము భద్రము చేయబడియున్నది.

“స్నేహితుడా! ఇప్పుడైనాను నీవు ప్రభువైన యేసుక్రీస్తుని నీ సొంత రక్షకునిగా స్వీకరించకపోతే ఆయనను ఒక న్యాయవాదిగా నీవు దర్శించవలసి వచ్చునుగదా! “మరియు ధవళమైన మహా సింహాసనమును దానియందు ఆసీనుడైయున్న యొకనిని చూచితివి; … గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరు ఆ సింహాసనము ఎదుట (దేవుని ఎదుట) నిలువబడియుండుట చూచితివి. ……వారిలో ప్రతివాడు తన క్రియలచొప్పున తీర్పు పొందెను” (ప్రక. 20:11-13).  కావున, నేడు నీవు మరణించినయెడల నీవు నిత్యమును ఎచ్చట గడుపుదువు?  నీవు మోక్షరాజ్యములో అనగా స్వర్గములో స్వాస్థ్యము పొందవలెనని కోరినయెడల నీ జీవితమును ప్రభువైన యేసుకు అప్పగించుకొని ఈ క్రింది ప్రార్థనను వల్లించుము;

“యేసు ప్రభువా, నా పాపములకొరకు నేను పొందవలసిన శిక్షను మీరు మీమీద మోసికొని నాకొరకు మరణించిరని నేను నమ్ముచున్నాను.  నేను చేసిన పాపములన్నింటిని క్షమించుము. నన్ను నిత్యమైన స్వర్గరాజ్యమునకు అర్హునిగా చేయుము. ఆమేన్”.